స్వరాష్ట్రంలో చదువుల తల్లికి అగ్ర తాంబూలం

Spread the love

విద్యలోనూ తెలంగాణా దేశానికే ఆదర్శం
నేటి విద్యా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
విద్యార్థుల భవిష్యత్ కు కేసీఆర్ బంగారు బాట
కేసీఆర్ నాయకత్వం లో విద్యా వ్యవస్థ కొత్త పుంతలు
బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య
దేశానికే రోల్ మోడల్ గురుకులాలు
తెలంగాణా చరిత్ర, భాషకు పట్టం
బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు
[సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

విద్యా రంగంలో కూడా తెలంగాణా నెంబర్ వన్ స్థానంలో దూసుకు పోతోందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జరగనున్న విద్యా దినోత్సవాన్ని పురస్క రించుకొని ఎంపీ నామ సోమవారం ఇక్కడ ప్రకటన విడుదల చేశారు. నేడు పండుగ వాతావరణంలో జరిగే విద్యా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఎంపీ నామ పార్టీ శ్రేణులకు, అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. తెలంగాణా చదువుల తల్లిగా మారింద న్నారు. సీఎం కేసీఆర్ ఈ 9 ఏళ్లలో విద్యా రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి, సంస్కరించారని అన్నారు. నాడు బూత్ బంగళల్లా ఉన్న బడులు నేడు కార్పొరేట్ భవనాలుగా వెలుగొందుతున్నాయని అన్నారు. నాడు నెర్రలిచ్చిన గోడలు, విరిగిన బెంచీలు, ఖరాబైన నల్లబోర్డులు నేడు అదునికతను సంతరించుకు న్నాయని పేర్కొన్నారు. స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ చదువుల తల్లికి అగ్రతాంబూలం ఇచ్చి, దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.

ఇంగ్లీష్ మీడియం చదువులు, గురుకులాలు, గ్రంధాలయాలు , ఆధునిక బోధనలు, మహిళా యూనివర్సిటీ, సంస్కృత యూనివర్సిటీ ఇలా చెప్పు కుంటూ పోతే ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరిగాయని చెప్పారు. తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తున్న గురుకుల విద్య ఇప్పుడు దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని తెలిపారు. స్వరాష్ట్రంలో పాఠశాల విద్య ఆధునిక పుంతలు తొక్కు తుందని అన్నారు. వేగవంత మైన పరిపాలనా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శ కత్వంలో ఉన్నత విద్యలో కూడా అనేక సంస్కరణలు విజయవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయని తెలిపారు. భోధనాభ్యాసాల్లో ఆధునిక సాంకేతికతను జోడించడం జరిగిందని చెప్పారు.పేద, బడుగు, బలహీన వర్గాల విద్యా ప్రమాణాలు పెంపొందిం చడానికి విస్తృత మైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మన ఊరు – మన బడి , మన బస్తీ – మన బడి పధకం ద్వారా పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేయడం జరిగిందని చెప్పారు. ఈ పధకం ద్వారా పాఠశాలల రూపురేఖలే మారిపోయా యన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత మైన , నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 7289.55 కోట్లతో దశల వారిగా 12 రకాలైన మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందని అన్నారు.


ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాటలు వేశారని తెలిపారు. బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయడం చరిత్ర అన్నా రు.రాష్ట్రంలో 1232 గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన గుణాత్మక విద్యలో తెలంగాణా వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా అగ్ర స్థానంలో ఉందన్నారు. తెలంగా ణా ఆవిర్భావం తర్వాత పిల్లల్లో సృజనాత్మకత సామ ర్థ్యం పెంపొందించడానికి వీలుగా పరీక్షా విధానంలో కూడా విప్లవాత్మకమైన సంస్క రణలు చోటు చేసుకున్నామని అన్నారు. ప్రధానంగాతెలంగాణ భాషకు చరిత్రకు పట్టం గట్టడం జరిగిందన్నారు. బాలికా వికాసం , సాధికారత కోసం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ మైన , నాణ్యమైన బాలికా విద్యా కేంద్రాలుగా మన కేజీబీవీలు బాసిలుతుండడం మనందరికీ ఎంతో గర్వ కారణమని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు.

Related Posts

You cannot copy content of this page