భద్రతను మెరుగుపరిచేందుకు సైబరాబాద్ పోలీస్‌తో భాగస్వామ్యం చేసుకున్న ఏడీపీ ; నగరంలో 32కు పైగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
హైదరాబాద్, 28 మార్చి 2023: నగరంలో భద్రతకు భరోసానందించడంలో భాగంగా మరో అడుగు ముందుకు వేస్తూ, *ఏడీపీ ఇండియా* ఇప్పుడు సైబరాబాద్ పొలీస్ శాఖతో భాగస్వామ్యం చేసుకుని 83 సీసీటీవీ కెమెరాలను నానక్‌రామ్‌గూడా ప్రాంతంలో ఏర్పాటుచేసింది.
కోవిడ్–19తో జరుగుతున్న పోరాటంలో ముందు వరుసలో ఉండి అవిశ్రాంతంగా పోరాడిన పోలీస్ శాఖకు మద్దతుగా ఏడీపీ నిలుస్తూ మొదటి దశలో 51 కెమెరాలను 2021లో ఏడీపీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు రెండవ దశలో 32 నిఘా కెమెరాలను ఏర్పాటుచేయడంతో పాటుగా మార్చి 28,2023 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పొలీస్ శ్రీమతి కె శిల్పవల్లి; మాదాపూర్ డివిజన్ ఏసీపీ శ్రీ రఘునందన్ రావు ; గచ్చిబౌలి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జి.సురేష్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఏడీపీ ఇండియా తరపున శ్రీ విజయ్ వేములపల్లి, జనరల్ మేనేజర్ – మేనేజింగ్ డైరెక్టర్ ; డాక్టర్ విపుల్ సింగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , హెడ్ ఆఫ్ హెచ్‌ఆర్, కమ్యూనికేషన్ , సీఎస్‌ఆర్ , ఏడీపీ ఇండియా మరియు ఇతర సీనియర్ లీడర్లు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ కెమెరాల ఏర్పాటును పోలీస్ శాఖకు మద్దతునందించడంతో పాటుగా వీధులలో కదలికలను వాస్తవ సమయంలో గమనిస్తూ భద్రతను మెరుగుపరిచేందుకు కృషి చేయడమే లక్ష్యంగా చేసింది. ఈ సీసీటీవీలు నగరంలోని నానక్‌రామ్‌గూడా ప్రాంతాన్ని కవర్ చేయడంతో పాటుగా ఐదు కిలోమీటర్ల మేర ఇవి వ్యాప్తి చెంది ఉంటాయి.
ఈ సందర్భంగా శ్రీమతి కె శిల్పవల్లి మాట్లాడుతూ ‘‘ గతంలో అంటే 2021లో 51 కెమెరాలను ఏర్పాటుచేయడంతో పాటుగా ఇప్పుడు మరో 32 కెమెరాలను అందుబాటులోకి తీసుకురావడమనేది నానక్‌రామ్‌గూడా చుట్టుపక్కల ప్రాంతాలలో కమ్యూనిటీలను అతి దగ్గరగా పరిశీలించడానికి, తద్వారా శాంతిభద్రతలను అదుపులో ఉంచడానికి , ఈ ప్రాంతంలో శాంతిని నిర్వహించేందుకు వెచ్చించే సమయం, వనరులను తగ్గించడంలోనూ గణనీయంగా తోడ్పడతాయి. అత్యంత సురక్షితమైన నగరాలలో ఒకటిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఈ తరహా బలమైన కమ్యూనిటీ కార్యక్రమాలతో పాటుగా ఏడీపీ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి పెద్ద సంస్ధలు మద్దతు అందిస్తుండటం కూడా దీనికి కారణం. కొద్ది సంవత్సరాల క్రితం ఏడీపీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాకు రాజ్‌భవన్ రోడ్‌లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేయడంలో తోడ్పడటంతో పాటుగా ఇప్పుడు 83 కెమెరాల ఏర్పాటులోనూ మద్దతు అందించింది. హైదరాబాద్ పొలీస్ శాఖ తరపున, ఈ తరహా కార్యక్రమాలను చేపట్టడంతో పాటుగా వాటిని అమలు చేయడానికి ఎప్పటికప్పుడు తోడ్పాటునందిస్తున్న ఏడీపీకి ధన్యవాదములు తెలుపుతున్నాను’’అని అన్నారు.
ఈ కార్యక్రమం పట్ల తన అభిప్రాయాలను శ్రీ విజయ్ వేములపల్లి వెల్లడిస్తూ ‘‘ తాము నివశిస్తున్న, కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ప్రాంతంలో కమ్యూనిటీల పట్ల అత్యంత బాధ్యతతో వ్యవహరించడం ద్వారా ఏడీపీ యొక్క వారసత్వం విస్తరించింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా మనసుకు నచ్చినవి. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో మేము పలు కార్యక్రమాలను ప్రారంభించాము. వీటిలో యూత్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్‌లు, బీద వర్గాల ప్రజలకు విద్యనందించడం, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మద్దతు అందించడం, షెల్టర్ హోమ్స్‌కు తోడ్పాటునందించడం మరీ ముఖ్యంగా సామాజికంగా, భావోద్వేగాల పరంగా మరియు భౌతికంగా వేధింపులను ఎదుర్కొన్న పెద్దలు మరియు పిల్లలను జాగ్రత్తగా చూసుకునే షెల్టర్ హోమ్స్‌కు మద్దతునందించడం, మొక్కలు నాటే కార్యక్రమాలు, పీఎం కేర్ ఫండ్స్‌కు ప్రత్యేక విరాళాలు, నిలోఫర్ లాంటి హాస్పిటల్స్‌లో సౌకర్యాలు మెరుగుపరిచే కార్యక్రమాలు మరియు మరెన్నో ఉన్నాయి. మా అసోసియేట్లు ఈ లక్ష్యాలను చేరుకోవడంలో గణనీయమైన తోడ్పాటును అందించారు. ఈ తరహా మద్దతు మరియు స్ఫూర్తి మమ్మల్ని మరింతగా ప్రోత్సహించడంతో పాటుగా ఈ తరహా సీసీటీవీ ఇన్‌స్టాలేషన్స్ మరియు భవిష్యత్‌లో మరెన్నో కార్యక్రమాల ద్వారా సమాజానికి తోడ్పాటునందించేందుకు మమ్మల్ని ప్రోత్సహించనున్నాయి’’ అని అన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ విపుల్ సింగ్ మాట్లాడుతూ ‘‘బాధ్యతాయుతమైన కార్పోరేట్ పౌరుడు ఏడీపీ. మా సామాజిక బాధ్యత కార్యక్రమం, తరంగ్‌లో భాగంగా చేపట్టే ప్రతి కార్యక్రమమూ అధికారులు స్థానికులకు సురక్షితమైన మరియు ఆరోగ్యవంతమైన జీవనోపాధి అందించడంలో తోడ్పడుతుంది. పోలీస్ శాఖకు మా మద్దతునందించడం పట్ల సంతోషంగా ఉన్నాము. తద్వారా హైదరాబాద్ భద్రత, లా అండ్ ఆర్డర్ పరంగా నూతన ప్రమాణాలను సృష్టించనున్నాము. సమాజ అభివృద్ధి దిశగా మా నిబద్ధతతో సామాజిక బాధ్యత అనేది ఏడీపీ యొక్క సిద్ధాంతంలో అంతర్భాగంగా ఉంది. ఈ సీసీటీవీ కెమెరాలను ప్రభుత్వ అధికారుల మద్దతుతో అందించడమనేది మా లక్ష్య సాధనలో మరో అడుగు దగ్గరగా వేసేందుకు తోడ్పడింది ’’ అని అన్నారు.
గత పదమూడు సంవత్సరాలుగా ఏడీపీ స్ధిరంగా కమ్యూనిటీలకు తమ ఉద్యోగ ఆధారిత మరియు నాయకత్వ ఆధారిత కమ్యూనిటీ , మహిళా సాధికారిత, పర్యావరణం, విద్య, ఉపాధి కార్యక్రమాల ద్వారా సేవలనందిస్తుంది. వారి మిడాస్ (మేకింగ్ ఇంపాక్ట్‌ఫుల్ డిఫరెన్స్ ఎట్ స్కూల్ ) మోడల్ స్కూల్ కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, యూత్ డెవలప్‌మెంట్ కేంద్రాలు, తాము మద్దతు అందిస్తున్న ఒక ఎన్‌జీఓ ద్వారా మహిళా ఇంజినీరింగ్ విద్యార్ధులను ఉద్యోగాలలో నియమించుకోవడం, బహుళ షెల్టర్ హోమ్స్‌కు మద్దతు అందించడం, ఏడీపీ అసోసియేట్లు వలెంటీర్ చేసిన విద్య మరియు నైపుణ్య శిక్షణ వర్క్‌షాప్‌లు, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు మద్దతు అందించడం ద్వారా హైదరాబాద్, పూనెలలో వేలాది కుటుంబాలపై సానుకూల ప్రభావం చూపింది.