ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాసులు, అడ్మిషన్లు ప్రారంభం
జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బైరి శ్రీనివాస్
తెలంగాణ ప్రభుత్వం మరియు ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఈ నెల ఒకటవ తేదీ నుండి అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభం కావడం జరిగిందని మరియు ఈ సంవత్సరo ఫస్ట్ ఇయర్ వివిధ గ్రూపులలో చేరే విద్యార్థులకు ఉచిత అడ్మిషన్స్ ప్రారంభం కావడం జరిగింది. కావున పదవ తరగతి పాస్ అయినా విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉచిత అడ్మిషన్స్, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉత్తమ విద్య, ఉన్నత ఫలితాలు సాధించే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత అడ్మిషన్ పొందాలని జనగామ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బైరి శ్రీనివాస్ కోరారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించే వివిధ కార్యక్రమాలలో విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
కాలేజీ లో ఎక్కువ అడ్మిషన్స్ కొరకు అధ్యాపకులు కృషి చేయాలనీ మరియు ఫెయిల్ ఐనా విద్యార్థులు ప్రత్యేక క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ మహమ్మద్ ఆఫ్జాల్ కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు వేముల శేఖర్, సేతి నందిని పటేల్, కాలేజీ లైబ్రేరియాన్ రంగన్న, అధ్యాపకులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్, గోక గణేష్, డాక్టర్ వరూధిని, కాపర్తి శ్రీనివాస్, మరిపెల్ల రవిప్రసాద్, తిరుమలేష్, ముక్తాదిర్, రజిత, ప్రియదర్శిని, శంకర్, రేఖ, సబిహా బేగం మరియు ఆఫీస్ స్టాఫ్ విష్ణు,శ్రీనివాస్,పద్మ తదితరులు పాల్గొన్నారు