టీహబ్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఆదిత్య థాకరే

Spread the love

సాక్షిత : మంత్రి కేటీఆర్‌ను కలవడం ఉత్తేజాన్ని ఇస్తుందని ఆదిత్య థాకరే అన్నారు. ఇవాళ ఆయన టీహబ్‌ను విజిట్ చేశారు. అక్కడ అమేజింగ్ వర్క్ జరుగుతున్నట్లు థాకరే ప్రశంసించారు.
ఆదిత్య చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు.
హైదరాబాద్‌ శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాకరే ఇవాళ హైదరాబాద్‌లోని టీహబ్‌ను సందర్శించారు.
అక్కడ మంత్రి కేటీఆర్‌తో ఆయన చర్చలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో తన ట్విట్టర్‌లో ఆదిత్య థాకరే స్పందిస్తూ.. మంత్రి కేటీఆర్‌ను కలిసిన ప్రతిసారి అద్భుతంగా, ఎంకరేజింగ్ ఫీలవుతానని అన్నారు. సుస్థిరత, పట్టణీకరణ, సాంకేతికత లాంటి అంశాలపై ఇద్దరం చర్చించుకున్నామని, భారత దేశ ప్రగతిలో ఆ అంశాలు కీలకమైనవన్న విషయాన్ని ప్రస్తావించుకున్నట్లు ఆదిత్య థాకరే తెలిపారు. టీహబ్‌(THub)లో జరిగిన వర్క్ గురించి ఆదిత్య థాకరే స్టన్ అయ్యారు. టీహబ్ మహాద్భుతంగా ఉందన్నారు. స్టార్ట్ అప్‌లు, ఆవిష్కర్తలు, ఆలోచనాపరులకు టీహబ్ మంచి ఊతం ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆదిత్య థాకరే చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. గత ఏడాది దోవోస్‌లో జరిగిన సదస్సులో కలిశామని, ఆ తర్వాత మళ్లీ ఆదిత్యను కలవడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో మరింతగా చర్చించుకుందామని మంత్రి కేటీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page