SAKSHITHA NEWS

మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్

అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టారని జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారన్నారు. తహసీల్దారు కార్యాలయంలో నిర్వహించిన కల్యాణ లక్ష్మీ మరియు బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మరియు 49 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన చెక్కులు బీసీ బంధు ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అందులో భాగంగా పేద ఆడపడుచుల పెళ్లి ఘనంగా చేసుకోవడానికి కల్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టారని జడ్పీ ఛైర్మన్ అన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ సంరక్షణ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని జడ్పీ ఛైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, వైస్ ఎంపీపీ చంద్ర శేఖర్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు MD యూనిస్ అక్బని, స్థానిక సర్పంచ్ గజానంద్ నాయక్, SMC చేర్మన్ రాథోడ్ సుభాస్,BRS పార్టీ మండల అధ్యక్షులు మెస్రం హనుమంతు, కోఅప్షన్ మెంబెర్ దస్తగిరి, సేక్ హైమద్, సయ్యద్ కాసిమ్,మాజీ ఎంపీటీసీ రమేష్ రాథోడ్, కనక ప్రభాకర్, షేక్ హుసేన్, తాసిల్దార్ రాజ లింగం, రామేశ్వర్ రాథోడ్, MPDO రమేష్, డిప్యూటీ తాసిల్దార్ అమృత్ లాల్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS