ఉమ్మడి గుంటూరు జిల్లా
ఆశ్రమ ఆస్తులపై అక్రమంగా ప్రవేశించేవారిపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టన సిఐ శోభన్ బాబు ను జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు సూచించారు .ఆశ్రమ భాద్యులు .భక్తులు శుక్రవారం అంబటిని కలసి ఆశ్రమ ఆస్తులలో కొంత భాగాన్ని పెద్దిరెడ్డి గోవిందరెడ్డి మరికొందరు ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారని విజ్ఞాపన పత్రం అందించారు .దీనిపై స్పందించిన మంత్రి అంబటి స్థానికి సిఐ శోభన్ బాబు కు ఫోన్ లో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని .ఆశ్రమ నిర్వహనకు అడ్డుపడుతూ నిరంతరం అక్రమానుకు ప్రయత్నిస్తున్నవారిపై విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టాలన్నారు .ఆశ్రమ ఆస్తులు పూర్తిగా రిజిస్టర్ కాబడినవని దాత ఆశయాలకు అనుగుణంగా గత 84సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు విద్య వైద్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కొందరు కావాలని తప్పుడు పత్రాలు సృష్టించుకొని ఆశ్రమ ఆస్తులను ఆక్రమించుకోవాలనుకోవటం మంచి పద్దతి కాదని ఆశ్రమ చింతాడ బ్రహ్మానందరావు విలేకరులకు తెలిపారు .ఆశ్రమం అధీనంలో ఉన్న ప్రతి ఆస్తికి తగిన పత్రాలు ఉన్నాయన్నారు .అధికారులపై ఒత్తిడి తెస్తూ చివరికి ఆశ్రమభాద్యు లు ఆక్రమించుకొంటున్నారని తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు .ఇప్పటికే సంబంధిత అక్రమ తప్పుడు రిజిస్ట్రేషన్ లపై కోర్టు లలో కేసులు నడుస్తున్నాయన్నారు .సత్తెనపల్లి కోర్టు వారు శాశ్వత ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చియున్నారని భాద్యులు తెలిపారు .అనంతరం ఆశ్రమ గురువులు రత్నచారి ఆధ్వర్యంలో వేద పాఠశాల విద్యార్థులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటాన్ని అందించారు .మంత్రిని కలిసినవారిలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్ష కార్యదర్సులు నాగభూషణ చారి .విద్యాసాగర్ .యువజనసంఘం నాయకులూ పోతులూరి గోపి .వైసీపీ నాయకులూ అచ్యుత శివప్రసాద్ .వెలుగురి శరత్ బాబు వల్లెపు చెన్నకేశవ .మోదుగుల వెంకట్ .ఆశ్రమ భక్తులు సరితా .సింధుషా .వెంకట రెడ్డి .బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు .