బాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్యలు

Spread the love

చంద్రబాబు అరెస్ట్ అక్రమమం

స్కిల్ డెవలప్​మెంట్ కేసులో ఆరోపణలు వట్టి బుటకం:పనబాక

బాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్యలు

గూడూరు, సర్వేపల్లి,వేంకటగిరి లో టిడిపి చేస్తున్న దీక్షల్లో పాల్గున్న పనబాక

బాబు మచ్చలేని నేత :పనబాక

: స్కిల్ డెవలప్​మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి పలు పార్టీల నేతలు మద్దతిస్తున్నారు. చంద్రబాబుది అక్రమ అరెస్టు అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ పనబాక లక్ష్మి చంద్రబాబు అరెస్టుపై మరోసారి స్పందించారు. బాబు అరెస్టు రాజకీయ కక్షతోనే అని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. ఏపీలో వైసీపీ నేతలకు ఓ దురలవాటు ఉందని.. తప్పును తప్పు అని చెబితే చంద్రబాబు ఏజెంట్లు అని అంటారని ఆమె ఎద్దేవా చేశారు.

గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గల్లో ఆయా నియోజకవర్గం టిడిపి ఇంచార్జి లు రిలే దీక్షలు చేస్తున్నారు. శుక్రవారం మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ పనబాక లక్ష్మి దీక్ష శిబిరాల వద్దకు చేరుకొని వారికీ మద్దతుగా నిలిచారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ
తప్పు చేస్తే అరెస్టు చేయడం తప్పుకాదు. దాన్ని ఎవరూ కాదనరు.. తప్పు పట్టరు కూడా. కానీ ఎఫ్​ఐఆర్​లో పేరు లేని వ్యక్తిని ఎందుకు అరెస్టు చేశారో నాకు అర్థం కావడం లేదు. చంద్రబాబు అరెస్టు అక్రమం. అది ప్రజలకు కూడా తెలిసిపోయింది. అందుకే ఏపీలో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అంత ఆదరాబాదరాగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సమావేశాలు జరుగుతున్న సమయంలోనే చంద్రబాబును అరెస్టు చేసేందుకు సమయం కుదిరిందా. దీనివల్ల జగన్ సర్కార్​కే నష్టం. ఇప్పుడు చంద్రబాబుకు ప్రజల్లో మైలేజ్ పెరిగింది. అని ఆమె అన్నారు.

ప్రజలు బాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తున్నారు:పనబాక

700 మందితో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సర్వే చేశారని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వివరించారు. అందులో 90 శాతం మంది చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకించారని వివరించారు. కేవలం 63 మంది మాత్రమే అరెస్ట్ సమ్మతం అన్నారని.. అందులో కొందరు అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పు పట్టారని పేర్కొన్నారు. అంటే చంద్రబాబు అరెస్ట్‌ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.. ఏపీలో, హైదరాబాద్‌లో చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే అన్నారు.

నెల్లూరులో వైసీపీ బలంగా ఉంది. 10 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. సో.. 90 శాతం మంది చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకించారంటే.. మెల్లిగా టీడీపీకి అనుకూలంగా మారుతుంది. ఇదే సిచుయేషన్ మిగతా చోట్ల కూడా ఉంటే.. తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తోంది. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం వైసీపీకి చెడ్డ పేరు తీసుకొస్తోంది. ఇదే విషయాన్ని సర్వే కూడా తెలియజేస్తోందిఅనీ ఆమె చెప్పారు.

కొన్ని సర్వేలు టిడిపి అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 120 సీట్లు టిడిపి గెలుస్తోందని చెబుతోంది. అందుకే సీఎం జగన్.. చంద్రబాబు అరెస్ట్ చేసేందుకు మొగ్గు చూపి ఉంటారు. కానీ పరిస్థితి క్రమంగా మారిపోతుంది అన్నారు. వెంటనే చంద్రబాబు కు బెయిల్ వచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి లేకుండా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం అవుతాయానీ ఆమె హెచ్చరించారు. ఈమె వెంట టిడిపి నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page