వేస్ట్ మెటిరీయల్ కాలువల్లో వేస్తే చర్యలు తీసుకుంటాము – అదనపు కమిషనర్ సునీత
*
సాక్షిత తిరుపతి : *వేస్ట్ మెటిరీయల్స్ ముఖ్యంగ బిల్డింగ్ మెటిరీయల్స్ కాలువల్లో వేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ తంబల సునీత స్పష్టం చేసారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంధ్రమౌళీశ్వర్ రెడ్డిలు ప్రజల పిర్యాధులకు సమాధానమిచ్చారు. నోబెల్ లాడ్జి ఎదురుగా వున్న బిల్డింగును డెమాలీష్ చేయడంతో వాటి మెటిరీయల్ వలన కాలువ బ్లాక్ అయినదని, సంబంధిత యజమానులు పట్టించుకోలేదనే పిర్యాధుపై స్పందిస్తూ తమ సిబ్బందిని పంపించి శుభ్రం చేయిస్తామని చెబుతూ నగరంలోని కాలువల్లో వేస్ట్ మెటిరియల్ వేయవద్దని, అలా వేసిన వారిపై జరిమానాల రూపంలో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏసి సునీత తెలిపారు. నారాయణపురం హరిగ్రీవ అపార్ట్‌మెంట్ ముందర రోడ్డు వర్షాలకు గుంతలు పడి వాహనదారులకు ఇబ్బందిగా వుందని, గుంతల్లో నీరు నిల్వడం వలన దోమల బెడద ఎక్కువ అవుతున్నదనే పిర్యాధుపై స్పందిస్తూ తమ అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆర్.ఎస్.గార్డెన్ వద్ద నున్న తమ ఇంటి ముందరున్న చెట్టు కూలిపోయే స్థితిలో వున్నదని, ప్రమాధం జరగక ముందే ఆ చెట్టును తొలగించాలని ఓక మహిళ కోరడంతో పది రోజుల్లోపు పారెస్ట్ , విధ్యుత్ సిబ్బందితో మాట్లాడి తొలగించే పని చేస్తామన్నారు. రామచంధ్ర పుష్కరిణి చుట్టు కార్లు పార్క్ చేస్తూన్నారని, ఇందు వలన అక్కడ మల,మూత్రాలు పోస్తున్నారనే పిర్యాదుపై పరిశీలిస్తామన్నారు. మరి కొందరు పోన్ల ద్వారా తమ పిర్యాధుల్లో డ్రైనేజి సమస్యలు చెప్పడంతో, వెంటనే సిబ్బందిని పంపించి క్లీన్ చేయిస్తామని అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంధ్రమౌళీశ్వర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, ఆరోగ్యాధికారి డాక్టర్ హరికృష్ణ, రెవెన్యూ అధికారులు లోకేష్ వర్మ, సేతుమాధవ్, ఆర్.ఎఫ్.ఓ జ్ఞాన సుందరం, మేనేజర్ చిట్టిబాబు, ఏసిపి షణ్ముగం, ఫైర్ ఆఫిసర్ శ్రీనాధ్ రెడ్డి, శానిటరి సూపర్ వైజర్ చెంచయ్య పాల్గొన్నారు.