Action should be taken against “water” plants running against norms!
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న “వాటర్” ప్లాంట్ల పై చర్యలు తీసుకోవాలి!
సాక్షిత ప్రతినిధి. మినరల్ వాటర్ అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వాటర్ ప్లాంట్ల యజమానులు. నాచుతో నిండిన వాటర్ బాటిలలో 15 రూపాయలకు మినర్ వాటర్ అమ్మకాలు.
నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం నియోజకవర్గాలలో,మండలాలలో,గ్రామాలలో,అడ్డగోలుగా వాటర్ ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ అడ్డూ,అదుపు లేకుండా అందులో “కెమికల్స్ అధిక మోతాదుల్లో వేస్తూ ప్రజల ఆరోగ్యాలతోచెలగాటమాడుతున్నా సంబంధిత అధికారులు నామమాత్రపు తనిఖీలు కూడా నిర్వహించడం లేదు.ప్రజల ఆరోగ్యాలతోచెలగాటమాడుతున్నా అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు.ప్లాంట్ల లో నమూనాలు సేకరించి తగు చర్యలుతీసుకోవాలి.
నిబంధనల ప్రకారం వాటర్ ప్లాంట్లకు మున్సిపాలిటీఅనుమతి,పరిశ్రమ శాఖ నుండి పార్టు1,లైసెన్సు,బీఎస్ఐ అనుమతులు,ఐఎస్ఐ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టారీతినవాటర్ ప్లాంట్ల లను నడుపుతూ వినియోగదారుల నుండి అక్రమంగా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.ఇకనైనా సంబంధిత జిల్లా అధికారులు మేలుకొనినిబంధనలకు. విరుద్ధంగా నడుస్తున్న “వాటర్” ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలి