Action should be taken against traders selling fake seeds
రైతాంగానికి కావలసిన ఎరువులు,విత్తనాలు, క్రిమి సంహారక మందులు అందుబాటులో ఉంచాలి.
నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి.
రైతు బంధు సహాయం వెంటనే చెల్లించాలి.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్.
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : రైతాంగానికి కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డు వికాస్ బి ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గo సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది రైతులు పంట వేసేందుకు సిద్ధం అవుతున్నారని, ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు,ఎరువులు,పురుగుల మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రతి ఏటా మార్కెట్ లో నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి రైతులు అనేక విధాలుగా ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాలు లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఫేర్టిలైజర్స్ షాపులపై దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు అమ్ముతున్న డీలర్ల పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న దృశ్య ప్రభుత్వం వెంటనే రైతు బంధు నిధులు రైతుల అకౌంట్ ల లో జమ చేయాలని కోరారు. ప్రభుత్వం అన్ని రకాల విత్తనాలు, పురుగుల మందులు, క్రిమిసంహారక మందులు సబ్సిడీ ధరలకే అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. రుణమాఫీ వెంటనే చేసి రైతులను రుణ విముక్తి చేయాలని సూచించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జి. నాగయ్య, మల్లు లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలిశెట్టి యాదగిరిరావు,పారేపల్లి శేఖర్ రావు, మట్టిపల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app
epaper Sakshitha
Download app