SAKSHITHA NEWS

భవన నిర్మాణాలకు ఉపయోగించు సెంట్రింగ్ షీట్స్ లను దొంగతనం చేయు ముద్దాయిలు అరెస్టు

తిరుపతి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ పరిదీలలో. నేరాలు.

అరెస్ట్ కాబడిన ముద్దాయిలు:

1).దాటి. సునీల్, వయసు 29 సంవత్సరాలు, తండ్రి వెంకటేష్, ఇంటి నెంబర్ 5-114, ఎన్టీఆర్ కాలనీ,పేరూరు, తిరుపతి జిల్లా, కులం. SC (మాల),
2).పిండి గణేష్, వయసు 20 సంవత్సరాలు, నా తండ్రి పిండి ఈశ్వరయ్య, ఆంధ్ర బ్యాంక్ కాలనీ, సాయి నగర్,తిరుపతి పట్టణం మరియు జిల్లా, కులం. SC (మాల).
3).బైనపల్లి వెంకట క్రిష్ణ @ వెంకీ, వయసు 19 సంవత్సరాలు, తండ్రి వెంకటేశ్వర్లు, ఆంధ్ర బ్యాంక్ కాలనీ, సాయి నగర్, తిరుపతి టౌను మరియు జిల్లా,
4). చట్టము తో సంగర్షణ పడ్డ బాలుడు (Absconding)

కేసు వివరాలు :-

  తిరుపతి జిల్లాలో సుమారు 7 నెలల నుండి కొత్తగా భవన నిర్మాణాల వద్ద నిర్మాణాలకు ఉపయోగించే సెంట్రింగ్ షీట్లు, పిల్లర్ బాక్సులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలు చేస్తున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐపీఎస్.,కి పిర్యాదు అందింది ఆ మేరకు ఈ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేదించి బాధితులకు న్యాయం చేయాలని  ఇన్స్పెక్టర్, యస్.ఐ. లను మరియు సిబ్బందిని నియమించారు.

జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు తిరుపతి SDPO మురళి కృష్ణ గారి పర్యవేక్షణలో తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ రెడ్డి, యస్.ఐ యస్.నాగేంద్ర బాబు మరియు సిబ్బంది బృందం ఈ దినం అనగా 11-04-2023 తేదీ మద్యాహ్నం 2.30 PM గం.లకు ఈస్ట్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ రెడ్డికి రాబడిన సెంట్రింగ్ ఐరన్ సామాన్లు దొంగల గురించిన ఖచ్చితమయిన సమాచారము మేరకు ఈస్ట్ యస్.ఐ నాగేంద్ర బాబు మరియు సిబ్బంది హెచ్.సి 783, 1256, PCs 448,1466, 2355 వారి సహితముగా రేణిగుంట రోడ్ ఆర్చ్ వద్ద వాహనాలు తనిఖి చేస్తువుండగా బోలోరో వాహనం నెంబర్. AP 39 TZ 8262 ముగ్గురు ముద్దాయులు 1). దాటి సునీల్, వయసు 29 సంవత్సరాలు, 2). పిండి గణేష్, వయసు 20 సంవత్సరాలు, 3). బైనపల్లి వెంకట క్రిష్ణ @ వెంకీ, వయసు 19 సంవత్సరాలు ముద్దయాలను సుమారు 03-00 గంటలకు పట్టుకొని అరెస్ట్ చేసి వారిని విచారించగా తిరుపతి జిల్లా లోని పలు కేసుల లో
1) 71/2023 U/S 379 IPC of Renigunta U PS 2) 95/2023 U/S 379 IPC of M.R.Palli PS 3) 97/2023 U/S 379 IPC of M.R.Palli PS 4) 107/2023 U/S 379 IPC of Tirchanur PS 5) 108/2023 U/S 379 IPC of Tirchanur PS 6) 62/2023 U/S 379 IPC of Yerpedu PS 7) 63/2023 U/S 379 IPC of Yerpedu PS 8) 67/2023 U/S 379 IPC of SKHT Rural 9) 140/2022 U/S 379 IPC of SKHT Rural 10) 60/2023 U/S 379 IPC of Naidupeta PS 11) 105/2023 U/S 379 IPC of East PS 12) 108/2023 U/S 379 IPCIPC of East PS 13) 62/2023 U/S 379 IPC of Naidupet PS 14) 63/2023 U/S 379 IPC of Naidupet PS and 15) 111/2023 U/S 379 IPC of Tirchanur PS నేరాలు చేసినట్లు అంగికరించినారు. ముద్దాయిల వద్ద నుండి సెంట్రింగ్ షీట్లు, పిల్లర్ బాక్సులు మరియు జాకీ రాడ్స్ లు వాటి విలువ సుమారు Rs.15,00,000/- వుంటుంది. వాటిని స్వాధీనం చేసుకొని ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్ట్ కి పంపనున్నారు.

కేసు వివరాలను బుధవారం నాడు ఈస్ట్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో శ్రీమతి విమలా కుమారి అదనపు ఎస్పీ క్రైమ్ వారు పత్రికా ముఖంగా తెలియజేశారు.

ఈ సమావేశంలో ఈస్ట్ డిఎస్పి మురళి కృష్ణ సి ఐ శివప్రసాద్ ఎస్ఐ నాగేంద్రబాబు పాల్గొన్నారు.

ప్రతిభ:-

  ఈ కేసులో ప్రతిభ కనపరచిన తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ బి.వి.శివ ప్రసాద్ రెడ్డి, సబ్- యస్.ఐ ఎస్.నాగేంద్ర బాబు, ఈస్ట్ పోలీసు స్టేషన్ సిబ్బందిని హెచ్.సి లు మునిరాజ, రవి, పి.సి లు జ్యోతినాద్, ప్రబాకర్, చిరంజీవి లను తిరుపతి జిల్లా ఎస్పీ  పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ అభినందిచినారు.

SAKSHITHA NEWS