ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ : కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్

Spread the love

సాక్షిత తిరుపతి నగరం:
రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న చర్యలపై తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పారదర్శంగా నిర్వహించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని క్లెయిమ్స్, అబ్జెక్షన్లపై తదితర అంశాలపై వివరించారు. తిరుపతి నియోజకవర్గంలో 267 పోలింగ్ బూతులు వుండగా, 1500 ఓటర్లు దాటిన పోలింగ్ బూతులు 4 వున్నాయని, కావున వాటికి సమీపంలోనే మరో 4 సహాయ బూతులు ఏర్పర్చేందుకు ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రాజకీయపార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ సెలవు పెట్టిన, మారిపోయిన బిల్వోల స్థానాల్లో వచ్చిన వారి వివరాలను అందించాలని కోరగా, త్వరలోనే అందిస్తామని కమిషనర్ తెలియజేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని చర్యలు చేపడతామని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తిరుపతి ఓటర్ నమోదు అధనపు అధికారులు తిరుపతి అర్బన్ ఎమ్మార్వో వెంకట సూర్యనారాయణ రెడ్డి, మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఇంకా డిప్యూటీ తాసీల్ధార్ అశోక్ రెడ్డి, ఎఈఆర్వోలు, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page