యాక్సిడెంట్ ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్ కోర్స్ అవగాహన కార్యక్రమమును ప్రారంభించిన అడిషనల్ డిసిపి సుభాష్ చంద్రబోస్.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
కోణిజర్ల లోని శ్రీరామ ఫంక్షన్ హాలులో రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాలు జరిగేటప్పుడు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై గ్రామ ప్రజలకు, ఆటో డ్రైవర్లకు మరియు పోలీసు సిబ్బందికి అవగహన కార్యక్రమాన్ని నిర్వహించినారు.
ఇందులో భాగంగా అత్యవసర సమయంలో ముఖ్యంగా ప్రమాదం జరిగిన సమమాలో గాయపడిన వ్యక్తులకు ఎటువంటి చికిత్స అందించాలో వివరించారు.
ప్రథమ చికిత్స మరియు సిపిఆర్ఐ గురించి ఈఎంఆర్ఐ వైద్యులు వివరించారు. ఈ కారక్రమాని లో వైరా ఏసిపి రెహమాన్, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, రోడ్ సేఫ్టీ డి.ఎస్.పి చంద్రభాను, సిసిఆర్బి సిఐ సాంబరాజు, ట్రాఫిక్ అశోక్, , కొణిజర్ల ఎస్సై శంకర్ రావు మరియు సిబ్బంది. 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.