సైన్స్ ఫేర్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

Spread the love

సైన్స్ ఫేర్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని షాపూర్ నగర్ శారద విద్యా భవన్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ మేరకు విద్యార్థులు ప్రదర్శించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ&సైన్స్ ల్యాబ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మోమెంటోలు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ దూదిమెట్ల సోమేశ్ యాదవ్, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకుడు నాగిళ్ళ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, మధుమోహన్, రెహ్మాన్, సాజిద్, అరుణ మరియు స్కూల్ కరస్పాండెంట్ ఇందిరా, ప్రిన్సిపల్ భూపాల్ రెడ్డి, హెడ్మాస్టర్ మల్లీశ్వరి, శివయ్య, శ్రీనివాస్ గౌడ్, దయాకర్, నర్సింలు గౌడ్, వరప్రసాద్, మహేష్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page