SAKSHITHA NEWS

కార్మిక రంగానికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవ సేవలు

20 కోట్ల రూపాయలతో ఆర్సిపురం ఈఎస్ఐ ఆసుపత్రి ఆధునీకరణ పనులు పూర్తి

ఆగస్టు 3న మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ల చేతుల మీదుగా ప్రారంభోత్సవం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం

ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలోని కార్మిక రంగానికి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

రామచంద్రపురం లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో 20 కోట్ల 79 లక్షల రూపాయలతో ఇటీవల ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

సోమవారం సాయంత్రం ఈఎస్ఐ ఆసుపత్రినీ సందర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్ ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులను పరిశీలించారు. అనంతరం వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈనెల 3 వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, కార్మిక శాఖా మంత్రి మల్లా రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ల చేతుల మీదుగా ఆధునికరణ పనులు ప్రారంభించిన ఉన్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.

పటాన్చెరు పారిశ్రామిక వాడలోని కార్మికులకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.


SAKSHITHA NEWS