యువ పెన్సిల్‌ కళాకారుడు

Spread the love

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాకు చెందిన యువ పెన్సిల్‌ కళాకారుడు జీవన్‌ జాదవ్‌ అయోధ్యలోని బాలరాముడి విగ్రహాన్ని పెన్సిలు కొనపై అద్భుతంగా చెక్కాడు. మైక్రోస్కోపు సాయంతో 1.5 సెంటీమీటర్ల పరిమాణంలో దీన్ని రూపొందించాడు. పెన్సిల్‌ కొనలపై ఇప్పటికే ఎన్నో అద్భుత కళాఖండాలను చెక్కిన జీవన్‌ గిన్నిస్‌ రికార్డులో చోటుతోపాటు అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలోని డిజిటల్‌ మార్కెటింగ్‌ విభాగంలో ప్రాజెక్ట్‌ మేనేజరుగా పనిచేస్తున్న జీవన్‌కు చిన్ననాటి నుంచే ఈ కళలపై ఆసక్తి ఉండేది. స్కూలులో చాక్‌పీసులపై చిన్న చిన్న కళాఖండాలను చెక్కేవాడు. ఇంజినీరింగుకు వచ్చాక పెన్సిల్‌ ఆర్ట్‌ మొదలుపెట్టాడు. ఒకే పెన్సిలుతో 93 లింకులు కలిగిన గొలుసు తయారుచేయగా.. 2019లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు దక్కింది. ఇప్పటివరకు ధోనీ, ప్రధాని మోదీ, ఛత్రపతి శివాజీ, మహాత్మాగాంధీ, అబ్దుల్‌ కలాం, సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌, మైకేల్‌ జాక్సన్‌ సహా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు దేవతామూర్తుల బొమ్మలు వందకు పైగా పెన్సిలు కొనలపై ఈయన రూపొందించాడు. పెన్సిలుపై ఆంగ్ల అక్షరమాల చెక్కాడు….

Related Posts

You cannot copy content of this page