— లోక్ అధాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు – యస్.పి రాజేంద్ర ప్రసాద్ ఐపిఎస్
సూర్యాపేట సాక్షిత ప్రతినిధి
జూన్ 10వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అధాలత్ నిర్వహణపై జిల్లాలోని డిఎస్పీ లు, సీఐ లు, ఎస్ఐ లు, కోర్టు డ్యూటీ పోలీసు అధికారులు, కోర్టు లైజన్ అధికారులతో జిల్లా యస్.పి యస్.రాజేంద్ర ప్రసాద్ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించి సూచనలు సలహాలు చేసారు. ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ రాజీకి, పరిష్కారానికి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించాలని, గుర్తించిన కేసులను విభజించుకుని ప్రణాళిక ప్రకారం ముందుకెల్లాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ ల నందు సిబ్బంది టీములుగా ఏర్పడి పని చేయాలన్నారు. కేసులలో ఇరు వర్గాల వారికి జాతీయ లోక్ అదాలత్ గురించి వివరించి ఆవశ్యకతను తెలియజేయాలని తద్వారా కేసుల రాజీకి, పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
ముందస్తుగా ప్రణాళిక చేసుకొని 15 రోజులు పాటు కృషి చేస్తే ఎక్కువ సంఖ్యలో కేసులని డిస్పోస్ చేయగలుగుతామని రాజీ, పరిష్కారం చేయవచ్చని అన్నారు. కోర్టు సిబ్బంది, న్యాయవాదులు తో పోలీసులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. బాగా పని చేసే సిబ్బందికి రివార్డ్స్ అందించడం జరుగుతుందన్నారు. రాజీమార్గమే రాజ మార్గమని ప్రజలు గుర్తించాలని వివాదాలకు పోకుండా అందరూ సామరస్యంగా ఉండాలని పోలీస్ శాఖ తరపున కోరుతున్నట్లు తెలిపారు. యస్.పి వెంట డిసిఆర్ బి డిఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డిసిఆర్ ఇన్స్పెక్టర్ నర్సింహ, ఐటి కోర్ సిబ్బంది ఉన్నారు.