
124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన శ్రీ సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా కార్పొరేటర్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, CH.భాస్కర్, ఐలయ్య గౌడ్, పృద్వి, రాజ్యలక్ష్మి, స్వప్న, వరలక్ష్మి, పద్మ, రోజారమని, లక్ష్మమ్మ, కళ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
