- మంత్రి పొంగులేటి చొరవతో కైకొండాయిగూడెంలో డ్రెయినేజీ తిప్పలకు పరిష్కారం
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
మంత్రి పొంగులేటి మాటిచ్చారంటే ఆ పని పూర్తవ్వాల్సిందే. అందుకు కైకొండాయిగూడెం ఘటన ఓ చిన్న ఉదాహరణ. రాష్ర్టరెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జనవరి 31వ తేదీన కైకొండాయిగూడెం (ఒకటో డివిజన్)లోని గణేష్ టౌన్షిప్ ప్రాంతాన్ని సందర్శించారు.
ఆ ప్రాంతంలో కలియ తిరిగి.. స్థానికులతో ముచ్చటించగా.. గణేష్ టౌన్షిప్ ప్రాంతంలో మురుగు సమస్యను విన్నవించారు. దీంతో స్పందించి ఆయన సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించడంతో సత్వర చర్యలు చేపట్టారు. పొక్లేయిన్ ద్వారా కొత్తగా సైడ్ కాల్వ తవ్వించారు. పూడుకుపోయిన పాత డ్రేయినేజీలో మురుగు తొలగించే పనులు పూర్తి చేయించారు. దీంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించిందని ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గణేష్ టౌన్షిప్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, విహార అపార్ట్మెంట్ కార్యదర్శి గంగాధర్, స్థానికులు మంత్రి పొంగులేటికి తమ కృతజ్ఞతలు తెలిపారు.