శ్రీ పార్వతీ సమేత శివ నాగరాజేశ్వర స్వామివారి పల్లకి ఊరేగింపు ఉత్సవం

Spread the love

శ్రీ పార్వతీ సమేత శివ నాగరాజేశ్వర స్వామివారి పల్లకి ఊరేగింపు ఉత్సవం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం, పట్టణంలోని స్థానిక శ్రీనివాస్ నగర్ కాలనీలో గల శ్రీ పార్వతీ సమేత శివ నాగరాజేశ్వర శ్రీ శిఖరేశ్వర మహా మృత్యుంజయ పంచాయతన స్వామి వారి దేవస్థానం వారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం అనంతరం ఆదివారం ఉదయం ఉత్సవ మూర్తులకు పల్లకి ఊరేగింపు ఉత్సవం కోలాటాల యుక్తంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ప్రజలు తమ ఇండ్ల ముందుకే వచ్చిన కళ్యాణ మూర్తులను భక్తి శ్రద్ధలతో దర్శించి
టెంకాయలు, మంగళ హారతులు సమర్పించి తరించారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు తాటికొండల శ్రీనివాస శాస్త్రి, తాటికొండల శశిధర్, వోల వెన్ను కిషోర్ శాస్త్రి, ఓరుగంటి సూర్య నారాయణ, చిత్తలూరి నర్సయ్య గౌడ్,ఉర్లుగొండ భాస్కర్ రామ్ గౌడ్, బొల్లికొండ నరేందర్, ఐతగోని జానకి రాములు, తాటికొండ వెంకటేశ్వర్లు, మామిడి లక్ష్మీ నారాయణ, ఓరుగంటి పద్మ, పద్మావతి, పరమేశ్వరి ఇతర భక్త బృందం పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page