SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖలో భారీ మార్పులు చేశారు…

ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ కు కొత్తగా వచ్చిన సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ మీడియా సమావేశంలో సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి మాట్లాడుతూ…

పోలీస్ వాహనంలో ప్రయాణించే ప్రతి ఒక్క పోలీస్ అధికారి ముందు వాహనంలోని డ్రైవర్ ప్రక్కన ఉన్న సీటు లోనే కూర్చోవాలని అని ఆదేశాలు జారీ చేశారు.

ఈ మీడియా సమావేశంలో సి.పి అవినాష్ మహంతి అలాగే ఎల్లపుడు పోలీస్ లు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని…

పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్క అర్జీ దారుని ఫిర్యాదు స్వీకరించి త్వరగా కేసుని పరిష్కారం చేయాలని సైబరాబాద్ పరిధిలోగల పోలీస్ స్టేషన్ల అధికారులకు సూచించారు.

అలాగే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గల భార్ అండ్ రెస్టారెంట్లు,వైన్ షాపులు,హోటల్స్ మరియు టిఫిన్ సెంటర్లు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు చెప్పిన సమయంలోనే నిర్వహించాలని
పోలీస్ అధికారులకు సూచించారు.

ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది దీని మీద దృష్టి పెట్టి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఎవరైనా సరే సైబరాబాద్ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి మీడియా ముఖంగా మాట్లాడారు.


SAKSHITHA NEWS