SAKSHITHA NEWS

బంగారు బాపట్ల గా దీవించండి:క్రైస్తవ సమాధుల తోట కు మార్గం ఏర్పాటు చేస్తా: బి టి డి సి యూ సన్మాన సభలో కోనా వెల్లడి:

బాపట్ల టౌన్ డినామినేషన్ చె ర్చెస్ యూనియన్ వారి ఆధ్వర్యంలో శాసన సభ సభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి కి ప్రత్యేక సన్మాన కార్యక్రమం ను నిర్వహించారు. గురువారం ఉదయం స్థానిక విజయలక్ష్మి పురంలో నీ యల్ ఇ యప్ ప్రార్థన మందిరం నందు బి టి డి సి యూ సెక్రెటరీ పాస్టర్ రాజారత్నం అధ్యక్షత వహించారు.అలాగే ముఖ్యఅతిథిగా శాసన సభ్యులు కోనా రఘుపతి పాల్గొనగ ప్రత్యేక సందేశం, ఆశీర్వాదం ను అందించారు.యూనియన్ కమిటీ సభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొనాను దూసాలువాతో ను,పుల బోకెలతో సత్కరించారు.ఈసందర్భంగా బాపట్ల టౌన్ డినామినేషన్ చర్చేస్ యూనియన్ అధ్యక్షులు డా డి వి కృపాకరరావు మాట్లాడుతూ కోనా రఘుపతి కుటుంబంతో బాపట్ల ప్రజలకు ఉన్న అనుభందం మరువలేనిదని అన్నారు.అలాగే బాపట్ల అభివృద్ధి లో భాగంగా రోడ్లు విస్తరణ కానీ,మెడికల్ కాలేజీ ఏర్పాటు కు కృషి చేసిన మహనీయులుగా కోనా రఘుపతి బాపట్ల జిల్లా ప్రజలలో స్థిర స్థాయి గా నిలిచిపోతారు అని అన్నారు. అదేవిధంగా కోనా రఘుపతి బాపట్ల శాసన సభ్యులు గా మరోసారి గెలిచి ఉన్నత ప్రమాణాలు కలిగిన పదవులను అలంకరించాలని దివిస్తున్నమన్నారు.14సంవత్సరాలుగా క్రైస్తవ సమాధుల తోట సమస్య కు శాసన సభ్యులు శాశ్వత పరిష్కారం చూపారన్నారు.అలాగే భవిషత్ లో ఉన్నత పదవులు ను అలకరించాలని ఆశాభావం వ్యక్తంచేశారు.అనంతరం సన్మాన గ్రహీత శాసన సభ్యులు కోనా రఘుపతి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు గా క్రైస్తవ సమాధుల తోట సమస్య పరిష్కారం చేయడమే కాకుండా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అన్ని వర్గాల ప్రజల సమస్యలు ను పరిష్కార మార్గాలను చూపిస్తూనే ప్రజల మద్దతు ను కొరుతుందన్నారు.కోనా రఘుపతి నివాసం అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక దేవుని సేవకులు ఎవరైనా ఏ సమయంలో అయినా కోనాను కలుసుకో వచ్చునని శాసన సభ్యులు కోనా రఘుపతి పేర్కొన్నారు.దేవుని సేవకులు ఆశీస్సులు అన్ని వేళల తనకు ఉండాలని కోనా రఘుపతి సేవకులను కోరారు. అదేవిధంగా క్రైస్తవ సమాధుల తోట కు వెళ్ళే మార్గం ను త్వరలోనే పరిధరిస్తానని శాసన సభ్యులు కోనా రఘుపతి బాపట్ల టౌన్ డినామినేషన్ చేర్చ్స్ యూనియన్ కు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో వైసిపి పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు,బిటిడిసి ట్రెజర్ కట్టా అజయ్ కుమార్,ఉపాధ్యక్షులు గుడిపాటి దానియేలు,వరదల రత్న రాజు,దేవుని సేవకులు మల్లెల సుధాకర్,జాన్సన్,పాస్టర్ బుర్ర లుకా,దొనేపుడి సురేష్, కొండ్రు సురేష్,పువ్వాడ పీటర్ పాల్,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS