SAKSHITHA NEWS

క్రమశిక్షణకు మారుపేరు
ఎస్ డి హెచ్ ఆర్
ఇంటర్ లో విద్యార్థులు మంచి మార్కులు సాధించాలి…
ఆర్ ఐ ఓ ప్రభాకర్ రెడ్డి
ఘనంగా ఎస్ డి హెచ్ ఆర్ జూనియర్ కళాశాల వార్షికోత్సవం…


తిరుపతి,
క్రమశిక్షణకు, ఉత్తమ విద్యా బోధనకు మారుపేరు శ్రీ దేవపట్ల హరినాథ్ రెడ్డి( ఎస్ డి హెచ్ ఆర్) విద్యాసంస్థలు అని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి జీవి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గురువారం మహతి ఆడిటోరియంలో ఎస్ డి హెచ్ ఆర్ జూనియర్ కళాశాల వార్షికోత్సవం ఆ విద్యాసంస్థల చైర్మన్ డివిఎస్ చక్రవర్తి రెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగింది. కళాశాల వార్షికోత్సవానికి ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట విద్యాసంస్థల చైర్మన్ చక్రవర్తి రెడ్డి తో పాటు, ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి ప్రభాకర్ రెడ్డి, మోటివేటర్, సినీ ఆర్టిస్ట్ ప్రదీప్ కొండిపర్తి లు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అలవర్చుకోవాలని, విద్యార్థులు క్రమశిక్షణతో పాటు మంచి విద్యాబుద్ధులు అలవర్చుకొని చదువులో రాణించాలని కోరారు. ఎస్బిహెచ్ ఆర్ విద్యాసంస్థలు క్రమశిక్షణకు, ఉత్తమ ఫలితాలకు బ్రాండ్ అంబాసిడర్ గా రాయలసీమ జిల్లాల్లో పేరు ప్రఖ్యాతలు సాధించిందన్నారు. ఎస్ డి హెచ్ ఆర్ కళాశాలలో నాణ్యమైన విద్యను బోధించేందుకు అవసరమైన సీనియర్ ఆధ్యాపకులు, అధునాతన ల్యాబ్ సౌకర్యాలు యాజమాన్యం ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఏటా ఈ విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థులు అత్యంత ఫలితాలు సాధించడంతోపాటు ఉన్నత చదువులకు ఇంటర్మీడియట్ తొలి మెట్టు అని పేర్కొన్నారు.

అనంతరం ఎస్ డి హెచ్ ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డిబిఎస్ చక్రవర్తి రెడ్డి మాట్లాడుతూ తమ విద్యాసంస్థలలో విద్యార్థులు చేరినప్పటి నుండి వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మంచి ఫలితాలు సాధించడంలో తమ ఆధ్యాపకులు ప్రత్యేక దృష్టి పెడతారని చెప్పారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకోవాలని కోరారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చునన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను ప్రేమానురాగాలతో చూసుకోవాలని చెప్పారు.చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై కూడా ప్రత్యేక తరగతులు తీసుకొని వారూ కూడా మంచి ఫలితాలు సాధించేందుకు తాము తమ అధ్యాపక బృందం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. గత రెండు దశాబ్దాలకు ముందు శ్రీ దేవపట్ల హరినాథరెడ్డి విద్యాసంస్థలను స్థాపించి వేలాదిమంది విద్యార్థులకు ఉన్నత చదువులతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆర్థికంగా ఎదిగేలా చేశామని ఆనందం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో కూడిన ఉత్తమ విద్యను అందించడంతోపాటు మంచి ఫలితాలు సాధించడంలో తమ విద్యా సంస్థ ప్రత్యేక గుర్తింపు కలదని చక్రవర్తి రెడ్డి చెప్పారు. అనంతరం మోటివేటర్, సినీ ఆర్టిస్ట్ ప్రదీప్ కొండిపర్తి మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత ఏకాగ్రతతో విద్యను అభ్యసిస్తే సాధించలేనిది అంటూ ఏదీ లేదని విద్యార్థులకు సూచించారు. త్వరలో జరగబోయే పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడే అటు తల్లిదండ్రులకు ఇటు మీరు చదివిన కళాశాలకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అక్కడకు వచ్చిన వారినందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఉషా, అధ్యాపకులతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం తమ విద్యా సంస్థలలో చదువుతున్న శివాని జాతీయస్థాయి డాన్స్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల మెమొంటోతో సత్కరించారు.