SAKSHITHA NEWS

పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ: “పరిటాల రవీంద్ర ఒక ఆదర్శ నాయకుడు. ప్రజల సమస్యలపై మమకారం, నిర్భయతతో ముందుకు సాగిన నాయకుడు. ఆయన సేవలను తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆయన చూపించిన మార్గంలో ప్రజాసేవకు అంకితమై పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది,” అని తెలిపారు .

➖ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పరిటాల రవి అభిమానులు పాల్గొని పరిటాల రవీంద్ర సేవలను స్మరించుకున్నారు.