
ప్రభుత్వ ఆదేశాలు మేరకు జంతువధ, మాంస విక్రయము నిషేదించడమైనది కమిషనర్
చిలకలూరిపేట
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము గణతంత్ర దినోత్సవము సందర్భముగా తేది.26.01.2025న అనగా ఆదివారము చిలకలూరిపేట పురపాలక సంఘం నందు జంతువధ, మాంస విక్రయము నిషేదించడమైనది. కావున మాంసము వ్యాపారస్థులు, చికెన్ స్టాల్స్ వారు, చేపల వ్యాపారస్థులు మరియు హోటల్స్, రెస్టారెంట్స్ వారు 26.01.2025 ఆదివారము మాంసాహారము విక్రయము నిలిపివేయవలసినది తెలియజేయడమైనది. ఇందుకు భిన్నముగా వ్యవహరించు వారి పై చట్టరిత్యా తగు చర్యలు తీసుకోనబడునని తెలియజేయడమైనది.
