A minor earthquake shook Meghalaya
ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2:23 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా స్వల్ప స్థాయిలో కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. మేఘాలయలోని వెస్ట్ ఖాసీ హిల్స్ ప్రాంతంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. మరోవైపు ఈ ప్రకంపనలతో గాఢ నిద్రలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.