డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన కోల్‌కతాలోని వైద్య కళాశాల కొత్త ప్రిన్సిపాల్ తొలగింపు
డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రి కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్‌ను తొలగించారు. వైద్యుల నిరసనల మధ్య ఈ చర్యలు చేపట్టారు. అంతకుముందు కళాశాలలో జరిగిన విధ్వంసానికి కారకులపై చర్యలు తీసుకోవాలని డాక్టర్లు నిరసన తెలుపుతున్న సమయంలో ఆమె ఆగ్రహానికి గురైనట్లు వీడియోలో కనిపించింది. సందీప్ ఘోష్ రాజీనామా చేయడంతో సుహ్రిత పాల్‌ను ప్రిన్సిపల్ గా నియమించారు.