SAKSHITHA NEWS

పబ్బుల్లో బ్రీజర్లు సేవిస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్న మహిళా కార్పొరేటర్లు

— పురుష కార్పొరేటర్లకు ఖరీదైన లిక్కర్ ఉక్కాలాంటి విలాసవంతమైన ఏర్పాట్లు

— మేయర్ కార్పొరేటర్లను కోట్లతోనైనా కొనేస్తాం అనే ధీమాతో ఉందనే ఆరోపణలు

సమాజానికి సభ్యత సమస్కారం నేర్పే మేయర్ హోదాలో ఉంటూ మహిళా కార్పొరేటర్లకు పబ్బుల్లో బ్రీజర్లు తాగిపిస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా మేయర్ మేకల కావ్య ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
అధికార దాహంతో అవిశ్వాస తీర్మానంలో నెగ్గి మళ్లీ మేయర్ పదవిని చేజిక్కించుకోవడమే ఏకైక లక్ష్యంగా విచ్చలవిడిగా విందుల పేరుతో పబ్బుల్లో మహిళా కార్పొరేటర్లకు బ్రీజర్లు బిర్యానీలు పురుషులైన కార్పొరేటర్లకు ఖరీదైన లిక్కర్ ఉక్కాలాంటి విలాసవంతమైన సదుపాయాలు ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు ఎరగవేసి కార్పొరేటర్ లను లోబర్చుకునేందుకు మేయర్ మేకల కావ్య చేస్తున్న కుటిల యత్నాల పట్ల మేడ్చల్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు విద్యావేత్తలు రాజకీయ మేధావులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు గత నాలుగు సంవత్సరాల్లో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతానికి మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టి కార్పొరేషన్ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని మేయర్ తన స్వార్ధపూరిత వ్యక్తిగత ప్రయోజనాల కోసం విలాసవంతమైన జీవితం గడిపేందుకోసం గతంలో కార్మిక శాఖ మంత్రిగా కొనసాగిన మల్లారెడ్డి పూర్తి సహాయ సహకారాలతో 2 వేల గజాల ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణంతోపాటు బినామీ పేర్ల మీద కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం ఏలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవని మళ్లీ మేయర్ పదవిని కైవసం చేసుకుని అక్రమ మార్గంలో ఆస్తులు కూడబెట్టుకునేందుకు విచ్చలవిడిగా కార్పొరేటర్ల కొనుగోలు కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడుతున్నారు


SAKSHITHA NEWS