SAKSHITHA NEWS

పోరాటాలు, త్యాగాల చరిత్ర …….ఏఐఎస్ఎఫ్ ది
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలి

*సాక్షిత వనపర్తి :
పోరాటాలు త్యాగాల చరిత్ర గలది ఏఐఎస్ఎఫ్ అని జిల్లా ఇన్చార్జ్ జె రమేష్ విద్యార్థి సంఘం మాజీ నాయకులు గోపాలకృష్ణులు అన్నారు ఏఐఎస్ఎఫ్ 89వ ఆర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో తొలి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ నని దేశ స్వతంత్రం కోసం దేశ విముక్తి కోసం పోరాడే సంకల్పంతో ఏర్పడిన విద్యార్థి సంఘము అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో వీరోచిత పోరాటాలు చేసిందని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేసిన పోరాటంలో 32 మంది ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు

చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అన్న నినాదంతో నాటి నుండి నేటి వరకు ముందుకు సాగుతోందని కానీ బిజెపి ప్రభుత్వం విద్యను కాషాయకరించే కుట్ర చేస్తుందన్నారు రాష్ట్రంలో విద్య హక్కు చట్టం అమలు కై తాము పోరాడుతూనే ఉన్నామని గత ఆరేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు గత ప్రభుత్వంపెండింగ్ లో ఉంచిందని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు పాఠశాల కళాశాల భవనాలు హాస్టల్ భవనాలు ఉపాధ్యాయులు లెక్చలర్లు ల్యాబుల కొరత ఉందన్ ప్రభుత్వం స్పందించి మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు విద్యహక్కుల కోసం విద్యార్థుల తరఫున పోరాటాలు చేస్తున్న ఏఐఎస్ఎఫ్ లో పెద్ద ఎత్తున విద్యార్థులు చేరి సమస్యల పరిష్కారానికి చేస్తున్న పోరాటాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జే నరేష్ డివిజన్ కార్యదర్శి వంశీ చంద్రశేఖర్ మహేష్ మోహన్ విష్ణు అశోక్ రాము రాంబాబు శివ యాదవ్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS