SAKSHITHA NEWS

పార్టీలో గౌరవం దక్కకపోవడంతో కన్నీరు పెట్టుకున్న మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు

రాహుల్ గాంధీ నారీ న్యాయం నినాదం ఏం అయ్యింది?

గతంలో మహిళ కాంగ్రెస్‌కి పెద్దగా ప్రియారిటీ లేకుండే.. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నా కర్తవ్యం నిర్వహించాను.. 241 కార్యక్రమాలు నిర్వహించాం

గట్టిగా పని చేస్తుంది అని నమ్మి పార్టీ టిక్కెట్ ఇచ్చింది.. గోషామహల్ టిక్కెట్ వద్దన్న కూడా ఇచ్చారు..

నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అన్యాయం జరిగింది

టిక్కెట్ ఇచ్చిన వారికి పదవులు లేవు అన్నారు.. ఓడిపోయిన వారికి కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చారు

మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలును మార్చితేనే ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కి వస్తా అని ఇంచార్జీ దీప దాస్ మున్షీ అన్నారు.

బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు.. ఏ పదవి లేకున్నా పార్టీ కోసం పని చేస్తాం.

మహిళ కాంగ్రెస్‌లో ఒక్కరికీ పదవి రాలేదు – మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు


SAKSHITHA NEWS