SAKSHITHA NEWS

సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు *

సాక్షిత హనుమకొండ జిల్లా….
వర్ధన్నపేట టౌన్ మరియు మండల పరిధిలోని పలు గ్రామాలలో అనారోగ్యానికి గురైన వారు సిఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) 41 చెక్కులు సుమారు 14లక్షల 90వేల రూపాయల విలువ గల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు ..

అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-…

పేదలను అభివృద్ధి చేయడమే మన ప్రజా ప్రభుత్వం లక్ష్యం అన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు .

సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ చేసిన మన ప్రజా ప్రభుత్వం అన్నారు…

ఈనెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోస, రైతు భరోస, నూతన రేషన్ కార్డుల పంపిణీ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో అధికారుల వద్ద ఉన్న జాబితాలో పేరు లేని పథకాలకు అర్హులైన లబ్ధిదారులను దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. నేటి నుంచి నుంచి ఈ నెల 25 వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్న తరుణంలో సభలలో సైతం దరఖాస్తు చేసుకోవచ్చని లబ్ధిదారులకు సూచించారు. దీనిపై అర్హులు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా సాగుభూములకే రైతు భరోసా ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతను ఇవ్వడం, భూమి లేకుండా ఉపాధి హామీ పనిచేసుకునే నిరుపేదలకు ఆర్థిక భరోసా ఇవ్వడం, గత పదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు ఇవ్వడం లాంటి పథకాలు ప్రవేశ పెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. పేదలకు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలకు రాజకీయాలకతీతంగా మద్దతు పలకాలని కోరారు..

అలాగే మీకు ఏ సమస్య ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 8096107107 నెంబర్ కి ఫోన్ చేసి సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా లాంటి పథకాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకొని రండి తక్షణమే చట్టరీత్యా వారి పైన చర్యలు తీసుకుంటానని బహిరంగంగా తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ కౌన్సిలర్లు సమ్మెట సుధీర్ , రవీందర్, శ్రీలత, వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ టౌన్ అధ్యక్షుడు మైస సురేష్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్ మండల మహిళా అధ్యక్షురాలు & ఏఎంసీ డైరెక్టర్ కర్ర మాలతి – శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి కమ్మగొని ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకులు పోశాల వెంకన్న గౌడ్, కిమా నాయక్, శ్రీపాద సతీష్, యాదగిరి, మహిళ నాయకురాలు తీగల సునీత, తారాభాయి, మరియు వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….