సంవత్సరకాలం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పద్మశాలీల ఆత్మీయ సత్కారం….. బాపూజీ ఆశయశక్తే తనను ముందుకు తీసుకెళ్తుంది.. కందగట్ల స్వామి…… .. ………. ….. …నారాయణగూడ పద్మశాలి భవన్.;;;అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి ఎన్నికై సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా. నారాయణగూడ రాజమోహల్ల, పద్మశాలి భవన్ లో ABPS ఆధ్వర్యంలో,సన్మాన సత్కర సభ నిర్వహించారు ఈ సందర్భంగా. పద్మశాలి సంఘం వివిధ విభాగాల అధ్యక్ష కార్యవర్గo ప్రతినిధులు .కేక్ కట్ చేసి శాలువాలతో కందగట్ల స్వామిని ఘనంగా సన్మానించారు. ఆయన సంఘ అభివృద్ధికి చేస్తున్న సేవలను కొనియాడారు.. ఈ సందర్భంగా కందగట్ల స్వామి మాట్లాడుతూ. కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా పద్మశాలిల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.. బాపూజీ ఆశయశక్తే నన్ను ముందుకు తీసుకెళుతుందని పేర్కొన్నారు ఈ సంవత్సర కాలంలో జాతీయ వ్యాప్తంగా పద్మశాలి సంఘం బలోపేతానికి కృషి చేస్తున్ననని సంఘ సభ్యుల సహకారంతో పద్మశాలి ప్రతిష్టత, ఐక్యతకు పాటుపడుతున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ మాట్లాడుతూ.. పద్మశాలి సంఘ ఐక్యతకు ఎన్ని ఒడిదుడుకులైన ఎదుర్కొని సంఘాన్ని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ, సంఘ సభ్యుల ఔన్నత్యానికి కృషి చేస్తున్నారని ఆయన సారథ్యంలో కలిసి పనిచేయడం అదృష్టమని ఆయన పేర్కొన్నారు. సంఘ వివిధ విభాగాల ప్రతినిధులు మాట్లాడుతూ పద్మశాలిల గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడంలో కందగట్ల స్వామి కీలక పాత్ర పోషిస్తూ సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారన్నారు. ఏంతటి విపత్కర పరిస్థితులైన తన చాణక్యంతో ముందుకెళ్తూ సంఘాన్ని పటిష్ట పరచడంలో విశిష్ట కృషి చేస్తున్నారని సంఘ సభ్యులు ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో.. ABPS, చేనేత సంఘ ప్రతినిధులు గడ్డం జగన్నాథం, రాష్ట్ర అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ ,పుట్ట పాండురంగం, ఎర్ర మాద వెంకన్న ,వనం విశ్వనాథ్,కుంటాల తిలక్,కోక్కుల దేవేందర్, గంగదర్ తిలక్, నక్క వేణు మాధవ్,మచన మోహన్ నారాయణా, రాష్ట్ర మీడియా అధ్యక్షులు బొమ్మ అమరేందర్, ప్రచారవిభాగం కన్వీనర్ పుట్ట ఋషి ABPS మహిళా అధ్యక్షురాలు దుశ్శాంతల, ప్రతినిధులు గాడిపల్లి సంధ్యారాణి,వాణి, వానపల్లి వాణి, మీడియా ఇంచార్జ్ బొమ్మ ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు
రాజ్ మోహల్లాలో కందగట్ల స్వామికి ఘన సన్మానం
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…