SAKSHITHA NEWS

స్థానిక సర్వజ్ఞ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

స్థానిక వి.డి.వోస్ లోగల సర్వజ్ఞ పాఠశాల నందు ఉపాధ్యాయదినోత్సవంను జరుపుకున్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహా: తస్మైశ్రీ గురవేనమ: అంటు గురువులను స్మరించడమే కాకుండా టీచర్సైపై ఉన్న భక్తి ప్రస్ఫుటమైయ్యేల పెద్దఎత్తున వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా డైరక్టర్ ఆర్. వి. నాగేంద్రకుమార్ మరియు నీలిమ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి వారిని స్మరించుకుంటు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్.వి. నాగేంద్రకుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5న ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆయన నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటి వారికి బోధించటం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా వాచా నమ్మి, ఆచరించిన వ్యక్తి సర్వేపల్లి. కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు అతి సులభంగా బోధించేవారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీ. దూరంలోని తిరుత్తణిలో జన్మించారు. రాధాకృష్ణన్ బాల్యం నుంచే అసాధారణమైన తెలివితేటలు కనబరిచేవారు. ఆయన తెలివితేటలకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యేవారు. ప్రధాని నెహ్రూ కోరిక మేరకు డాక్టర్ రాధాకృష్ణన్ 1952-62 వరకు భారత ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. భారత్కు తొలి ఉప రాష్ట్రపతి అయిన డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 5నే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారని తెలియజేశారు. ఈ రోజున ఉన్నత స్థాయిలో ఉన్న చాలా మంది విద్యార్ధుల వెనుక వారి ముందుండి నడిపించిన టీచర్లు తప్పక ఉంటారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్ ఆర్.వి. నాగేంద్రకుమార్, మరియు ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.


SAKSHITHA NEWS