SAKSHITHA NEWS

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర….

పుణె కు చెందిన ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చారు….

నగరం లోని బంగారు దుకాణాలు బ్యాంక్ లను టార్గెట్ గా చేసుకుని చోరికి పాల్పడేందుకు వచ్చారు….

పుణె నుండి రైల్ మార్గాన నగరం లోని జీడిమెట్ల ప్రాంతానికి వచ్చారు….

లాడ్జ్ లలో షెల్టర్ తీసుకుంటే పోలీసులకు అనుమానం వస్తుందని జీడిమెట్ల లోని ఒక నిర్మాణంలో ఉన్న భవనం లో షెల్టర్ తీసుకున్నారు….

సంగారెడ్డి లోని గుమ్మడిధల గ్రామంలో ఒక టాటా ఏసి వాహనం చోరీ చేశారు….

చోరికి పాల్పడ్డ తరువాత చోరీ చేసిన టాటా ఏసి వాహనం లో పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు….

మహారాష్ట్ర లో చోరికి పాల్పడిన బంగారాన్ని సైబరాబాద్ లో విక్రయించి లక్ష రూపాయలు తీసుకున్నారు….

ఆఫెన్స్ చెయ్యడానికి ఐరన్ రాడ్ లు, కాప్స్,తల్వర్ లు కొనుగోలు చేశారు….

బంగారు దుకాణాలలో చోరీ చేసేందుకు రెక్కీ కూడా నిర్వహించారు….

మాకు పక్క సమాచారం వచ్చింది….

నిందితులు ఉన్న ప్రదేశం లో పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు….

ఈ అయిదుగురు నిందితులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్….


SAKSHITHA NEWS