A delegation of ministers visited the district
జిల్లాలో పర్యటించిన మంత్రుల బృందం
పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ( ) సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి, ప్రాజెక్టుల ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రుల బృందం తెలిపారు. భద్రాద్రి జిల్లాలోని అశ్వాపురం మండలంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, పర్యటించి సీతారామ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌజ్- 1 వద్దకు చేరుకొని పంప్ హౌజ్ పనులను పరిశీలించి పవర్ సప్లైను ప్రారంభించారు. ఆతర్వాత పంపు హౌజ్ -3 వద్దకు చేరుకొని ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
రైతులకు మేలు జరిగే విధంగా భారీ మధ్య చిన్న తరహా సాగునీటి పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ నాయక్, డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య, పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.