హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయో గించిన సీఎం రేవంత్‌పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు.
లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్‌పై ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్ వేదికగా) ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంభిం చిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తు న్నదని విమర్శించారు. తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తున్నదని విమర్శించారు.
సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుం దన్న విషయాన్ని మర్చిపోవ ద్దన్నారు. బీఆర్‌ఎస్ అధి నేతపై రేవంత్ రెడ్డి వ్యాఖ్య లు తీవ్ర అభ్యంతరకరమని చెప్పారు..