కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని దర్గా గడ్డ, చంద్రగిరి నగర్, ఓమర్ ఫారూఖ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కమిటీ నూతన సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని వారి నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు,
అనంతరం వారు మాట్లాడుతూ బస్తి అభివృద్ధికి సంక్షేమ సంఘం సభ్యులు వారధిగా నిలవాలని, బస్తీలలో నెలకొన్న ఎటువంటి సమస్యలున్నతన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించడానికి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ను, అధ్యక్షులు షాదుల్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ షబ్బీర్, సెక్రెటరీ షేక్ అబీబ్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ తాహీర్, ట్రెజరర్ నయుం, ఇస్మాయిల్ ఖాన్, మరియు కమిటీ సభ్యులు పండరి, నజీరుద్దీన్, నరేష్, జుబేర్, షేక్ ముజాహిద్, వాజిద్, షేక్ మెహరాజ్ తదితరులు పాల్గొన్నారు