వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్లబ్ ఫంక్షన్ హాల్ లో వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు, తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు పెంచిన 4016/- ఆసరా పెన్షన్లు అందజేశారు.
అనంతరం పెన్షన్ లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.