SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 19 at 10.53.41 AM

ఆంధ్రప్రదేశ్‌లో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి డాక్టర్‌ వైయస్‌ఆర్ కంటి వెలుగు పథకం కొత్త వెలుగుని ప్రసాదిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5.60 కోట్ల మందికి (అన్ని వయసుల వారికి) కంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్‌ 2019లో శ్రీకారం చుట్టారు. మొత్తం ఆరు దశల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

మొదటి దశలో 60,393 పాఠశాలల్లోని సుమారు 66.17 లక్షల మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహించగా.. 4.38 లక్షల మంది విద్యార్థులకి సమస్య ఉన్నట్లు గుర్తించారు. రెండో దశలో ఈ 4.38 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 1.58 లక్షల మందికి కళ్లద్దాలు, 310 మందికి కేటరాక్ట్‌ సర్జరీలు చేశారు. ఆ తర్వాత మూడో దశలో దాదాపు 39 లక్షల మంది పెద్దవారికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో దాదాపు 12.5 లక్షల మందికి కళ్లద్దాలు, 1.23 లక్షల మందికి కేటరాక్ట్‌ సర్జరీలను ఉచితంగా చేసి చూపుని ప్రసాదించింది జగనన్న ప్రభుత్వం.


SAKSHITHA NEWS