SAKSHITHA NEWS

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్
ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్


సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :
ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ ఆస్తులు విధ్వంసం చేస్తున్నారని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ దుయ్యబట్టారు.


మహనీయుల విగ్రహాల ఆవిష్కరణకు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ తో పాటు కలిసి హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి వచ్చిన ఆయన ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం పక్కన తాళాలు వేసి నిరుపయోగంగా ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చూసి కేంద్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పూర్వ పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వేలు జాతీయ రహదారులు పోస్ట్ ఆఫీసులు బ్యాంకులు టెలికమ్యూనికేషన్ వ్యవస్థను నెలకొల్పారు. ప్రజల సౌకర్యం కోసం గత 75 సంవత్సరాలుగా ఆయా రంగాలు సేవలు అందించాయన్నారు.

ఇప్పుడు స్వాతంత్ర స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటు పరం చేసి వాటి ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తుందన్నారు. ములకనూరు గ్రామంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో మరియు టవర్ పై కూడా చెట్లు మొలిచి ప్రభుత్వ ఆస్తులు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఇది కేవలం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా పాలన వ్యతిరేక విధానాలతోనే జరిగిందని కార్పొరేట్ల ఆదానీలకు,అంబానీలకు మేలు చేయడం కోసమే వారు పనిచేస్తున్నారన్నారు.

ఒకప్పుడు టెలిఫోన్ టవర్ల ద్వారా ఇంటింటికి టెలిఫోన్ కనెక్షన్లు ఉండి ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి మోడీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల దేశంలో లక్షల టవర్లు బిఎస్ఎన్ఎల్ ఆఫీసులు నిరుపయోగంగా మారాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఇండియా,రైల్వే, భారత్ పెట్రోలియం,షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, పోర్టులు,నేషనల్ హైవేలు వంటి ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని అమ్మేస్తున్నారన్నారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహి అనే ముద్ర సిబిఐ ఈడీ ఇన్కమ్ టాక్స్ ల పేరుతో బెదిరింపులు దాడులు దేశం కోసం ధర్మం కోసం అంటూ దేశ సంపదను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నారని ద్వజమెత్తారు. మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్ల రాజకీయం చేస్తు పబ్బం గడుపుతున్న బిజెపికి త్వరలోనే బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ప్రజలే వారికి గుణపాఠం చెప్తారని వినోద్ కుమార్ అన్నారు.


SAKSHITHA NEWS