SAKSHITHA NEWS

వయో వృదుల ఉచిత వైద్య చికిత్స సంచార వాహనము ప్రారంభోత్సవం


*సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలోని టీఎస్ఐఐసి కాలనీలో సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్య అతిధిగా వయో వృదుల కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వృద్దుల ఉచిత వైద్య చికిత్స సంచార వాహనాన్నిజండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణయే ప్రభుత్వ లక్ష్యమని, రాష్టంలోని ప్రతి ఒకరికి మెరుగైన వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందని, అందులో భాగంగా బస్తి దవాఖానాలు మరియు కంటి వెలుగు వంటి కార్యక్రమాలు చేపట్టి ఎల్లపుడు ఉచిత వైద్యం అందజేస్తోందని తెలిపారు. ఈ ఉచిత వైద్య చికిత్స సంచార వాహనముని ప్రతిఒక్కరు సద్వినియోగపరుచుకొని ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ మేడ్చల్ మల్కాజ్గిరి చైర్మన్ రాజేశ్వర్ రావు , శ్రీనివాస్ నాయుడు, జిఎహ్ఎంసి ఆసరా సెంట్రల్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రావు,బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, జనరల్ సెక్రటరీ సిద్ధికి, మధుమోహన్, పెద్ది మల్లేష్ రెహమాన్,రోషన్, ప్రభు దాస్,లక్ష్మీనారాయణ, దాస్ సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేష ప్రెసిడెంట్ సాయిబాబా, కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెక్క సురేష్ బాబు,జనరల్ సెక్రటరీ సూర్యనారాయణ, భాస్కర్ రాజు, అమ్మాజీ, కె.వీ. సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS