కనిగిరి సాక్షిత న్యూస్ : కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని
శివారు కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న నీరు మరియు విద్యుత్తు సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయనున్నట్లు కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. పట్టణంలోని 3వవార్డు శంఖవరం లో సమస్యా పరిస్కారంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫూర్ పర్యటించగా వార్డు ప్రజలు నీరు మరియువీధి లైట్స్ సమస్య తో బాధపడుతూ ఉన్నామని ఫిర్యాదు చేయగా వెంటనే కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ స్పందించి మున్సిపల్ అధికారులను పిలిపించి వార్డులో డీ బోర్ ద్వారా ఇంటింటికి కుళాయి ద్వారా నీరు కల్పించాలని కోరగా త్వరిత గతిన కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే విద్యుత్ స్థంబాలకు ఉన్నటువంటి వీధి లైట్స్ వెలగకుండా అంతరాయం కలుగుతుందని ప్రజలు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు మున్సిపల్ విద్యుత్ అధికారులు పిలిపించి వార్డులో వీధి లైట్స్ సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు ఇబ్భంది పడుతున్నారు కనుక విద్యుత్ స్థంబాలకు ఉన్నటువంటి వీధి లైట్స్ భాగు చేయాలని అధికారులను కోరగా సానుకూలంగా స్పందించి త్వరిత గతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ A.E.కోటేశ్వరరావు,నవీన్, వర్క్ ఇన్స్పెక్టర్ షరీఫ్ ఉద్దీన్ సచివాలయం శానిటరీ సెక్రటరీ రమణ రెడ్డి, వైసీపీ నాయకులు పెన్న ఏడుకొండలు, ఫమీరవలి, బాలకృష్ణ రెడ్డి వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.