SAKSHITHA NEWS

హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు మరో ఝలక్‌ తగిలింది. ఆయన గడిచిన రెండు నెలలుగా చెప్తున్న కొల్లాపూర్‌లో చేరికల సభ అటకెక్కింది. ప్రియాంక గాంధీ సమక్షంలో తాను కాంగ్రెస్‌లో చేరుతానం టూ ఆయన చెప్తున్న మాటలు నీటిమూటలయ్యా యి. అదిగో.. ఇదిగో అంటూ ఆయన చెప్పిన తేదీలన్నీ ఉత్తుత్తువే అని తేలిపోయింది.

గడిచిన రెండు నెలలుగా జూపల్లి కృష్ణారావు తాను కొల్లాపూర్‌లో భారీ సభ పెట్టి పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌లో తన చేరిక సభ లక్షల మందితో ఉంటుందని, దీనికి పార్టీ హైకమాండ్‌ మొత్తం తరలివస్తుందని చెప్తూ వచ్చారు. అధిష్ఠానం నుంచి ఆయనకు అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు. తొలుత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిక, భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభల్లో వచ్చి చేరాలని ఏఐసీసీ పెద్దలు చెప్పారు. అయితే, జూపల్లి మాత్రం ససేమిర అన్నారు. తాను కొల్లాపూర్‌లో సభ పెడ్తానని, దీనికి పార్టీ అగ్రనాయకురాలు ప్రి యాంక గాంధీ రావాలని షరతు పెట్టారు.


కొల్లాపూర్‌కు జూలై 20న రావాలని ప్రియాంకను కోరగా ఆమె ఒప్పుకోలేదు. జూలై 25న వస్తారని, ఆ రోజే సభ నిర్వహంచి కాంగ్రెస్‌లో చేరుతానని చెప్పారు. కానీ, ప్రియాంక రాకపోవడంతో సభను జూలై 30కి వాయిదా వేసుకున్నారు. అప్పటికీ రాకపోగా ఆగ స్టు 2కు మార్చాడు.

ఒకవేళ ఆగస్టు 2న రాకపోతే ఆగస్టు 5న పక్కాగా చేరిక ఉంటుందని చెప్పారు. కానీ, ఏఐసీసీ పెద్దలు జూపల్లి ప్రతిపాదనలకు ససేమిరా అన్నారు. ‘కొంతమంది మాజీ ఎంపీటీసీ స భ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యు లు ఢిల్లీకి వచ్చి పార్టీలో చేరుతున్నారని, మిమ్మల్ని కొల్లాపూర్‌కు వచ్చి చేర్చుకునేంత తీరిక లేదు. అంత పెద్ద నేతలు కూడా మీ దగ్గర ఎవ్వరు లేరు. మీకు వీలైతే చేరండి.. లేకపోతే లేదు. మరో సందర్భంలో చూసుకుందాం’ అంటూ ఢిల్లీ అధిష్ఠానం తేల్చి చెప్పింది. ఇక తప్పని పరిస్థితుల్లో ఆయన ఢిల్లీలోనే చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అనుచరులకు వాట్సాప్‌ మెసేజ్‌లు పంపారు.


SAKSHITHA NEWS