కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్లో దళిత బంధు పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు… ఈ కార్యక్రమానికి దాదాపు 1100 మంది దళితులు హాజరయ్యారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలతో మరియు అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలో నిలబెట్టారని..
దళితులు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు వెళ్లేందుకు దళిత బంధు ద్వారా వారికి పది లక్షల రూపాయలు అందించి జీవితంలో వారి ఉన్నతకి సహాయ పడుతున్నారని అన్నారు.. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు వారు ఎంచుకున్న వ్యాపారానికి సంబంధించి ముందుగా అవగాహన పెంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అందించే రుణం ద్వారా ఆర్థిక ఉన్నతి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.. అలాగే ఈ పథకానికి సంబంధించి ఎవరైనా బయట వ్యక్తులు కానీ కార్యకర్తలైనా సరే లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ..
ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు ముద్దమ్ నరసింహ యాదవ్.. మహేశ్వరి శ్రీహరి .. పండాల సతీష్ గౌడ్ ..ఆవుల రవీందర్ రెడ్డి .. సబీయా గౌసుద్దీన్ అధికారులు పాల్గొన్నారు… అనంతరం అల్లాపూర్ డివిజన్ పర్వత్ నగర్ లో 59 జీవో ప్రకారంగా రెగ్యులర్ అయిన లబ్ధిదారులకు పట్టాలు అందించారు…