SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 29 at 5.59.06 PM

సాక్షిత : మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించిన స్థానిక ఎంపీ, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ..

నాగోల్, హస్తినాపురం, డివిజన్లో ముంపు ప్రాంతాలను సందర్శించి, స్థానిక ప్రజలను కాలనీ వాసులను అడిగి వివరాలను తెలుసుకున్నారు….
మున్సిపల్ అధికారులను పిలిపించి ముంపు ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా , తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు….ఈ
సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….
వర్షాకాలం నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు…
వర్షాల నేపథ్యంలో విపత్కర పరిస్థితిలో ఇప్పటివరకు ఒక్క అధికారుల సమావేశం నిర్వహించకుండా,
పార్టీ ఫిరాయింపు సమావేశాలు కండువా కప్పుకునే సమావేశాలు నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు…
ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ వరద ముంపు ప్రాంతాలను సందర్శించకుండా,
వరద బాధితులకు అండగా ఉంటూ వరద సహాయం అందించకుండా,
తన పుట్టినరోజు పేరిట విలాసవంతమైన జీవితం గడపడం సభ్య సమాజానికి సిగ్గుచేటు అన్నారు…

అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, 2018 లో ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంతో కొట్లాడి ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని చేస్తాడు అని గెలిపిస్తే…
ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి చేయలేనని అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్న అని చెప్పి,
సొంత స్వలాభం కోసం రియల్ స్టేట్ వ్యాపార అభివృద్ధి కోసమే పార్టీ మారారు అని అన్నారు….
అదేవిధంగా మూసినది డెవలప్మెంట్ చైర్మన్ గా ఉండి,
మూసి నదిని పట్టించుకోకుండా అక్రమ సొమ్ముని మూట కట్టుకొని,
ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలను మూసీ నదిలో నట్టేట ముంచిన ఘనత సుధీర్ రెడ్డి ది అని అన్నారు….
ప్రజలను మభ్యపెడుతూ నీతి మాటలు మాట్లాడుతూ అభివృద్ధి కోసమే పార్టీ మారినా అనే నీతి మాటలు పలికే దద్దమ్మ సుధీర్ రెడ్డి,
ఇకపై అభివృద్ధి అనే మాట మాట్లాడే అర్హత సుధీర్ రెడ్డి కి లేదు అన్నారు….

అదేవిధంగా ఈ సందర్భంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ….
ఎల్బీనగర్ నియోజకవర్గ జిహెచ్ఎంసి పరిధిలో ప్రతి అభివృద్ధి పనులలో,
స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతి, కమిషన్లకు పాల్పడుతూ…
ప్రతి అభివృద్ధి పనిలో నిర్లక్ష్యం చేస్తున్నారు అని సుధీర్ రెడ్డి పై మండిపడ్డారు….
మూసినది డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి మూసినది ముంపు బాధితులను కూడా పరామర్శించకుండా,
ముసినది సొమ్మును మూట కట్టుకొని,
ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి సిగ్గుండాలని అన్నారు….

ఈ కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, INTUC అధ్యక్షులు మిద్దెల జితేందర్,
జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, పలు డివిజన్ ల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు…..


SAKSHITHA NEWS