మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆల్విన్ కాలనీ డివిజన్ పాస్టర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ చౌరస్తా నుండి కూకట్పల్లి మెట్రో పార్క్ వరకు నిర్వహించిన శాంతి ర్యాలీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , మరియు క్రైస్తవుల తో కలిసి పాల్గొని సంఘీభావం తెలిపిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మాణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు అగలని, శాంతి నెలకొల్పలని, ప్రజలందరూ స్వేచ్ఛగా బ్రతికేల అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ,అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ జరుగుతున్న అల్లర్లను అరికట్టి శాంతి ని పునరుద్దరించాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
మణిపూర్ అల్లర్లలో మాన,ప్రాణాలు కోల్పోయిన ఎందరో అమాయకులు,అభాగ్యులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. మణిపూర్ రాష్ట్రంలోని అల్లర్లు, మరి ముఖ్యంగా క్రైస్తవులపై జరుగుతున్న దారుణ మారణకాండ ఇప్పుడు బయటికొచ్చింది. అది కూడా శృతిమించి జరుగుతున్న విశ్రుంఖలమైన కృరత్వంతో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు కోర్టులు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించడం వలన బయటకి వచ్చిన విషయం విదితమేనని, ఎందరో అమాయకులు, స్త్రీలు మాన ,ప్రాణాలు కొల్పయారు అని వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.భారతదేశం లౌకిక, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మహోన్నతమైన ప్రజాస్వామ్య దేశం మనది అని, ప్రపంచంలో నే గొప్ప పేరు గల దేశామని, దేశ ప్రజలందరినీ సమానంగా కుల, మతలకతీతంగా స్వేచ్ఛ, సమానత్వం ప్రజలందరూ సుఖంగా జీవించడానికి తోడ్పాటు ను అందించాలని, అన్ని మతాలను సర్వ సమానంగా చూడలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఎడ్వర్డ్ రోస్, ఇజ్రాయిల్ ,ఏసుపాదం, TR రాజు, కొమ్ము సాగర్ , రెవరెండ్ ఎం రాజు , బిషప్ శామీర్, సత్రాజ్ , శైలేష్ , జైపాల్ , రమేష్ , ఫిలిప్, గోపి, ఎస్ రాజు,ముఖేష్ మరియు సంబంధించిన సేవకులు దైవజనులు సంఘస్తులు దళిత క్రైస్తవులు అనేకమంది సోదరులు,సోదరీమణులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.