SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 27 at 2.52.02 PM

భారీ వర్షాలతో చెరువులు అలుగు పోస్తున్నాయి
వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి
ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండండిప్రజలకు సహాయక చర్యలు చేపట్టండి
పెద్ద వంగర మండలం పోచంపల్లి ఘటనలో చనిపోయిన వారికి సంతాపం
ఏ సమస్య ఉన్నా, అధికారుల దృష్టికి, నా దృష్టికి తీసుకురండి


సాక్షిత : పాలకుర్తి నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి ఎర్రబెల్లి
గత 5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాను ప్రాతినిద్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ పరిస్థితులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా గ్రామాల పరిస్థితిని మంత్రి ఎర్రబెల్లి ప్రజా ప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… భారీ వర్షాలతో అన్ని గ్రామాల్లో చెరువులు అలుగు పోస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రామంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని ఆదేశించారు. ఈ సమయంలోనే ప్రజలకు అండగా నిలబడాలని అన్నారు. వరదలతో ఏ సమస్య ఉన్నా, అధికారుల దృష్టికి, తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఏ సమస్య వున్నప్పటికీ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెద్ద వంగర మండలం పోచంపల్లి ఘటన బాధాకరమని, అన్నదమ్ములు వరదలో కొట్టుకుపోయి చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసింది అన్నారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియచేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.


SAKSHITHA NEWS