వరద పెరుగుతున్న నేపథ్యంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయండి
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ చొరవ తీసుకోవాలి
మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ జావిద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలతో జనజీవనం స్తంభించిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. భారీ వర్షాలు పడుతుండడంతో మున్నేరుకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో లోతట్టు ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పిసిసి సభ్యులు మహమ్మద్ జావిద్ ప్రజలకు పిలుపునిచ్చారు. మున్నేరు కు వరద పొటెత్తడంతో ఆ వరద ప్రవాహాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహ్మద్ జావిద్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నేరుకు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్నేరు వరద ఉధృతితో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పురాతన బ్రిడ్జ్ కావడంతో అధికారులు రాకపోకలను నిలిపివేయగా ప్రస్తుతం 16 అడుగులకు వరద ప్రవాహం చేరిందని, మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకు గానుఉందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్,విద్యుత్ శాఖ అధికారులను అభ్యర్థించారు. పునరావాస కేంద్రాలలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రజలకు ఆస్తి నష్టం జరిగితే తక్షణ సహాయం అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. అలాగే ఖమ్మం నియోజకవర్గం ప్రజలందరు వర్షాలు వస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఖమ్మం నగరంలో నాలాలు పొంగిపోర్లుతున్న నేపథ్యంలో రోడ్లపై వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలను తాకకుండా ఉండాలని, పోలీస్ అధికారులు వీధుల్లో మైకులు ద్వారా ప్రజలకు అవగాహణ కలల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మలేదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్, వైరా నియోజకవర్గ పిసిసి మెంబర్ వడ్డే నారాయణరావు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొంటేముక్కల నాగేశ్వరావు, సీనియర్ నాయకులు నల్లమల సత్యంబాబు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఏలూరు రవికుమార్, స్థానిక డివిజన్ నాయకులు షేక్ రజ్జి, షేక్ జానీ మియా, వసీం, మహమూద్, సాయికుమార్ తదితర నగర నాయకులు పాల్గొన్నారు