సాక్షిత : కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ A మరియు B బ్లాకులలో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గత నాలుగు రోజులుగా కురుస్తున్న బారి వర్షానికి ముంపుప్రాంతంలో ఉన్న ప్రజలను పలకరించి వారికీ ముంపుకి తగిన ఇటువంటి ఇబ్బంది తలెత్తుతే తప్పకుండ మా దృష్టికి తీసుకు రావాలని తెలిపారు, అలాగే రాజీవ్ గాంధీ నగర్ ఏ బ్లాక్ లో జరుగుతున్న భూగర్భ డ్రైనేజి పనులను పరియవేక్షించారు.
ఆర్ కె సొసైటీలోని చెత్త పాయింట్ రోడ్డు పక్కనే ఎక్కువ చెత్త ఉన్నందున అటువైపు వెళుతున్న పాదచారులకు మరియు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలందరికీ దుర్వాసనతో ఇబ్బంది తలెత్తుతుందని కార్పొరేటర్ తక్షణమే రాంకీ ఆర్ ప్ సి ఆర్ ఎఫ్ సి గార్బేజ్ డంపింగ్ వాహనాన్ని తెపించి గార్బేజ్ లిఫ్ట్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, జ్ఞానేశ్వర్, రియాజ్,ఆశు, రమేష్, బాబా, ముత్యాల దుర్గ, షమ, తదితరులుపాల్గొన్నారు