SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి

వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వయోవృద్ధుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు పామనుగుల్ల అచ్చాలు అన్నారు. మంగళవారం వారం చిట్యాల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ భవన్లో జరిగిన ఆ సంఘం సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ జిల్లా అధికారి నాగిరెడ్డి కి వినతి అందజేశారు. రాష్ట్రంలోని 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని కోరారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం వారి వారసుల ఆదాయం నుండి ప్రతినెల 5000 రూపాయలు వీరికి వచ్చేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం చట్టాలు చేయడమే కాకుండా ఆ చట్టాలను పకడ్బందీగా అమలు జరిగి వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. అనంతరం
మండల కేంద్రంలో వయోవృద్ధుల సంక్షేమ భవన్ ఏర్పాటుకు భూమిని కేటాయించి భవన్ నిర్మాణానికి కృషి చేయాలని కోరుతూ
తహాసిల్దార్ శ్రీనివాస్ కివినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులు ముత్తులింగం, కంచర్ల శంకర్ రెడ్డి, వడ్డేపల్లి ఎల్లయ్య, సత్తయ్య, ఆరూరి పెంటయ్య, ఎం.డి జాంగిర్, బిక్షపతి, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS